పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0349-1 బలహంస సంపుటం: 11-289

పల్లవి: కానీ కానీ యిఁక నేల కడమ దీరుతు గాక
         ఆన సుమ్మీ నీవు వచ్చి అట్టటు వోతేను

చ. 1: అస యిచ్చుకొని వద్ద నాతఁడు నిలుచుండఁగ
       వేసిన ట్టెల్లా నీకు జెల్లదా నేఁడు
       వోసరించి ముడివెట్టి వూరా కాతఁడు నవ్వఁగ
       యీసునఁ జేతులు చాఁచ యిఁక నెప్పుడే

చ. 2: మంతనాన నేమో చెప్పి మౌనాన నాతఁ డుండఁగ
       యెంతైనా వాదకు రాక యేల మానేవే
       యింత నిన్నుఁ జేసినట్టి యీతని దూరుతు గాక
       వింతగా నిన్నే మన వెఱ్ఱినా నేను

చ. 3: వొకరి ననఁ జాలక వొప్పగిం చాతఁ డుండఁగ
       అకట నీ రప మాయ నట్టె కానీవే
       వెకలి యై యిత్తరి శ్రీవెంకటేశుఁడు గూడఁగ
       మొకమోట నుంటిఁ గాక మోసపొయ్యేనా