పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0348-6 కన్నడగౌళ సంపుటం: 11-288

పల్లవి: చెప్పుడుబుద్దు లెందాఁక చిత్తములో నిలిచీనె
         యిప్పడె నాకుఁగాఁ బ్రియ మేల చెప్పేరే

చ. 1: తగులమి లేకుండతే తలఁపులో తమి లేదు
       నగవులు లేకుండితె ననుపూ లేదు
       తెగినపనులకును తిరిగి చూచుట రోఁత
       యెగసక్కెనకు వాని నేల పిలిచేరె

చ. 2: చూపు నాఁట కుండితేను చుట్టరికమే లేదు
       పై పైఁ బదర కుండితే బత్తే లేదు
      తీపుల చాలనిమాఁట తిరుగ నాడుక రోఁత
      యేపున వానితో మీరు యేల పోరెరే

చ. 3: జంటలు వాసి వుంటె సమ్మతించుటే లేదు
       వెంట వెంట రాకుండితో వేడుకే లేదు
       నంటుతోడ నన్నుఁ గూడె నమ్మ నిదె రోఁత యింక
       యింటిలో శ్రీవెంకటేశు నేల కొసరేరే