పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0348-4 సాళంగం సంపుటం: 11-286

పల్లవి: ఇల్లాలి కిది వోజా యిచ్చకమే వలెఁ గాక
         వొల్లనె ఆతఁడు దానే వొద్దకయ్యీఁ గాక

చ. 1: వొత్తుకోలుమోహములు వొగి నెందాఁకా వచ్చీ
       హత్తి మనసునఁ గలయంతే కాక
       తత్తరించి వాని నిఁకఁ దడవకురే మీరు
       కొత్తగా దయ వుట్టితేఁ గోరి వచ్చీఁ గాక

చ. 2: పూసుక వాసుక వచ్చెపొదు లెందాఁకా వచ్చీ
       ఆసతోడ నంత నైతే నమరుఁ గాక
       వేసరించ నిఁక నేలె వేఁగుదాఁకా నాతని
       బాసతో నమ్మి వుండఁగఁ బాలించీఁ గాక

చ. 3: బలిమిఁ బట్టెకాఁగిలి బడిబడి నేల వచ్చీ
       అలరుఁ గరిమి సరి యైతేఁ గాక
       యెలమి శ్రీవెంకటేశుఁడిప్పు డిట్టె నన్నుఁ గూడె
       యిలఁ దనసొ మ్మైతి నిట్టె యేలిఁ గాక