పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0348-3 బౌళి సంపుటం: 11-285

పల్లవి: ఎప్పటి కప్పుడె కాక యింత గలదా
         వుప్పొలికి యినుమ డౌ నొక్కరీతి వచ్చునా

చ. 1: అద్దో రమ్మనుచు నీవానలు వెట్టకువే
       చద్దివల పేడ నైన సంగర మౌనో
       తిద్దుబడి నీ కిచ్చినదె మాఁటపట్టు దొల్లి
       వుద్దండాన తప్పుఁదారు వూహించిన ట్టుండునా

చ. 2: అండ నుండు మని నన్ను నంత వాలాయించకువే
       అండుకొని మరుఁ డేడ నాయ మేసునో
       మెండుగా నీకు నిట్టె మీఁ దెత్తినవయసు
       బండు సేసి యెవ్వతింటి పంచపాలు సేసునో

చ. 3: కూచుండు మనుచు నన్నుఁ గొంగు వట్టి తియ్యకువే
       చూచి చూచి యెవ్వ తైన సూడు వట్టునో
       యేచి శ్రీవెంకటేశుఁడ యిట్టె నిన్ను నేఁ గూడితి
       యిచాయతమకయిన యిఁక నెంత సేసునో