పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0348-2 రామక్రియ సంపుటం: 11-284

పల్లవి: ఏ మంచిదాన నై నీయెదుట నుండే నేను
         వేమారు నూదితేఁ జల్ల వేఁడియై తోఁచురా

చ. 1: నేనే మనిన నీకు నెరుసు లై తోఁచీని
       మౌనాన నుండేఁ గాని మాఁట లాడించకురా
       వూని నే దొలుతె నాకు వొల్లనివాన నింతే
       తేనెలు వోయఁ బోయినా తెగి చేఁదే తోచురా

చ. 2: కడునే దగ్గరి యుంటె కావ లై తోఁచీని
       యెడసి వుండేఁ గాని యిట్టె పిలువకురా
       గొడవ వెట్టుక నేను గుండెబెద రైనదాన
       నడుమను గోర గీరినా నే రై పారురా

చ. 3: పైకొని కాఁగిలించి బలుము లై తోఁచీని
       యేకతాన నుండేఁ గాని యిక్కువ రేఁచకురా
       యీకడ శ్రీవెంకటేశ యెనసితిఁ గాని నిన్నె
       నీకు నే నిజ మాడితె నిష్టూరమై తోఁచురా