పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0348-1 దేసాళం సంపుటం: 11-283

పల్లవి: అయ్యో ఆఁడుఁదనము అంగడి వేయఁ దగున
         యియ్యడ నేఁ బ్రియమైతే యింత పచ్చి గలదా

చ. 1: సిగ్గువడి నే నుండఁగఁ జేపట్టి తీసీఁ బై పై
       యెగ్గెరఁగఁ డించుకంత యేమి సేతునే
       దగ్గరనె వున్నవారు తరుణు లందరు నదే
       బగ్గనఁ దాఁబైకొంటే పకపక నగరా

చ. 2: యిదివో వంచనతోడ యేమీ ననకుండఁగాను
       యెదురు మాఁటాడు మనీ నేమి సేతునే
       అదన నెదుటనె అత్తమామ లున్నవారు
       వదరు లిం తే లంటా వారైనఁ దిట్టరా

చ. 3: ముప్పరి మంచముమీఁద మొగి నేఁ డుండఁ గాను
       యిప్పుడె తా నిలుచున్నాఁ డేమి సేతునే
       అప్పఁ డిదె శ్రీవెంటాద్రిపతి నన్నుఁ గూడె
       దప్పి వోఁ బొరుగువారు తన్నునే పొగడరా