పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0347-4 మాళవి శ్రీ సంపుటం: 11-280

పల్లవి: కానీ కానీ మీఁదటెత్తు కంటిమి లేరా
         యినెపమె నేనుఁ జేసే నెందు వొయ్యే విఁకను

చ. 1: సతి నిన్నుఁ గొంగు వట్టె సబలోన నండగాను
       రతికిఁ దీసుక పోయ రా ననఁగానె
       యితరకాంతల కెల్ల నిదె చా లాయ నిఁక
       యితవై నీగుట్టు గంటి మెందు వొయ్యేవిఁకను

చ. 2: మానివి నీ నోరిలోన ముక్కవఁ దమ్ముల మిడె
       పానుపుపైఁ బడఁ దోసి పట్టుకోఁగానె
       ఆనుక కడమవారి కప్ప ణిచ్చిన ట్లాయ
       యీనటన మాకుఁ జిక్కె నెందు వొయ్యే మిఁకమ

చ. 3: కలికి బూతులఁ దిట్టి కాఁగిలించి యంటఁ బట్టి
       తలుపు మూసుక వుండెఁ దడవుగాను
       లలి శ్రీవెంకటేశుఁడ లంచ మిచ్చి నన్నుఁ గూడే
       విల నా కలవాటాయ నెందు వొయ్యే విఁకను