పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0347-3 దేశి సంపుటం: 11-279

పల్లవి: ఇటమీఁది పనులకు యిట్టె వేగిరింతునా
         కటకటా నే నంత కక్కూరితి సేతునా

చ. 1: యెగ్గు లెంచేదాననా యే మేమి నీవు సేసినా
       వొగ్గి నీకు నావయసు వొప్పింతుఁ గాక
       దగ్గరి నీ కెవ్వతో తప్పఁ జెప్పె నింతే కాక
       వెగ్గళపు టలుకకు వేళ మీఁద లేదా

చ. 2: వెంగె మాడేదాననా వే రొకతెతో నవ్వితే
       అంగము నీ కెక్కెనది యందుఁ గాక
       మంగిట నీ కెవ్వతో ముడివెట్టె నింతే కాక
       కంగి నిన్నుఁ దిట్టే నంటె కా దనేరా వొరులు

చ. 3: చలపట్టేదాననా సారె నీవు వేఁడుకొంటే
        తెలిసి నీతోఁ దెప్పలఁ దేలుదుఁ గాక
        బలిమి శ్రీవెంకటేశ పట్టి నన్నుఁ గూడితివి
        చెలులు నాతోడివారా చేతి కిచ్చే వాపెను