పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0347-2 సౌరాష్ట్రం సంపుటం: 11-278

పల్లవి: నిజ మాడితేఁ గనక నీవే నాదేవరవు
         గజరు నీచేఁతలకుఁ గలఁగీ నాచిత్తము

చ. 1: యిందరు వినఁగ నిన్ను యెందు వోతి వంటిఁ గాక
       నింద లే మైన నీకు నేఁ గట్టితినా
       కందువ యింత గలితే గడించుకొదువు నీవు
       అందుకె పో నిన్నుఁ గంటే నదరీ నామేను

చ. 2: యింతు ల్లెల్లఁ జూడగాను యిట్టట్టు రమ్మంటి గాక
       వింతగురుతులు నీమై వెదకితినా
       కాంతలఁ గంటేఁ జాలు కాకు సేయ నేరుతువు
       యెంతైన నిందుకె మాఁట యియ్యకొనఁ జాలను

చ. 3: నీ సతుల ముందరనె నే నిటు నవ్వితిఁ గాక
       సేస వెట్టి నిన్నుర గేలి సేసితినా
       ఆల శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
       వేసరక యిందుకె పో వేఁడుకొందు నిన్నును