పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0347-1 సాళంగం సంపుటం: 11-277

పల్లవి: సమతారుకాణ లైతె చల మెంత యెక్కునో
         అమర దింతక తొల్లె యలిగి యెరగును

చ. 1: కోపగించే మాఁటలకు గురి గాఁగ బని లెదు
       రాపుగా నావద్ది కింక రాకు మనరే
       యేపునఁ జెలులు చేప్పేయెడమాఁటలే చాలు
       తీపుల నెన్నఁడుఁ దన్నుఁ దెగనా డెరఁగను

చ. 2: దారి తప్పి నందుమీఁద దగ్గరి రాఁ బని లేదు
       సారెకు నన్నుఁ బిలిపించకు మనరే
       యీరస మణగుఁదాక యేకతములే మేలు
       బీరమునఁ దనతో నేఁ బెనఁగి యెరఁగను

చ. 3: బలిమి లో నైన మీఁద బంత మాడఁ బని లేదు
       వొలిసి కాఁగిట నిట్టె వుండు మనరే
       యెలమి శ్రీవెంకటేశుఁ డింత సేసి నన్నుఁ గూడె
       మలసి తన కెదురు మాఁటా డెరఁగను