పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0346-6 ముఖారి సంపుటం: 11-276

పల్లవి: ఇంకాఁ బెనఁగ నేల యింత చాలదా
         వుంకువగా నింతపని కోరిచినదాననా

చ. 1: వొద్దికి నే రాఁగానె వొక్కరితో మాఁటలాడే
       వద్దో‌ నాకు సిగ్గియ్యీ సంపరా నన్ను
       పెద్దరికేలకె నేఁ బెనఁగెటిదాన నింతే
       సుద్దు లెల్లాఁ గంటి నంత చులుకనిదాననా

చ. 2: దగ్గరి నే నుండఁగానె తలవంచు కుండితివి
       అగ్గల మయ్యీఁ గోప మంపరా నన్ను
       సిగ్గుతోడి బతు కొక్క చీమం తయినఁ జాలు
       యెగ్గు లెంచ మీద టెత్తు యెరఁగనిదాననా

చ. 3: కాఁగిలించుకుండఁగానె కన్నులు మూసేవు నీవు
       ఆఁగితిఁగా నిన్నిందాఁకా నంపరా నన్ను
       చేఁగ దేఁర గూడితివి శ్రీవెంకటేశ నన్ను
       రాఁగిన నీపొందు లెల్ల రచ్చ వేసేదానానా