పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0346-3 శంకరాభరణం సంపుటం: 11-273

పల్లవి: ఏల వేగిరించేవు యింట్టిపని గద్దు నాకు
         గోల వై వెలుపుల అరఁగుపై నుండవయ్యా

చ. 1: మందలోన నున్ననేము మాపటంతఁ గాని రాము
       దిందుపడఁ గొంగువట్టి తియ్యకువయ్య
       పొంది ఆవులు దూడలు బొలానఁ గలసుఁ జేసు
       అందాఁకా నీవు మాయింటియాడ నుండవయ్యా

చ. 2: చల్ల దచ్చి తచ్చి నేఁడు సందు లెల్ల నాకు నొచ్చు
        వొల్లనె విడె మిమ్మనే వోపనయ్య
        గొల్లఁడు దెచ్చినపాలకుండ లందుకొనవలె
        యిల్లు చొచ్చి అట్టుగపై నెక్కు కుండవయ్య

చ. 3: వెన్న గాఁచేవేళను విను మనఁ జాలను
        చన్ను లేల పిసికేవు సారెకు నయ్య
        యెన్నికతో శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
        పన్నిన మామంచముపై బవ్వళించవయ్యా