పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0346-2 శంకరాభరణం సంపుటం: 11-272

పల్లవి: ఏల చెనకేవు నన్ను నిప్పుడె నీవు
         తాలిమితోఁ బదరెటిదానఁ గాను నేనూ

చ. 1: వూర కిట్టె నా మీఁద నొళ్లు వేసితివి నేఁడు
       కారణ మేఁటిదో కాని కంద మిఁకను
       సారెఁ జట్టి పట్టితివి జారనపయ్యదకొంగు
       తేరకొన నిది యేమో తెలిసేరా నేను

చ. 2: మన సిచ్చి నాతోడ మాఁటలాడే విదె నేఁడు
       కొన మొద లేదో చూచుకొంద మిఁకను
       చన విచ్చి మంచముపై సంగడిఁ గూచుంటి విదె
       పని నిన్ను నడిగేరా పలుమారు నేను

చ. 3: గక్కనఁ గాఁగిలిచుక కందువ లంటేవు నేఁడు
       యెక్కువగా నవ్వేరా యిందుకే నేను
       నిక్కము శ్రీవెంకటేశ నీవు నన్నుఁ గూడితివి
       మిక్కిలి నిజాడలకు మెచ్చేరా నేను