పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0346-1 శుద్దవసంతం సంపుటం: 11-271

పల్లవి: నే నెంత నీ వెంత నిక్కెమా యిది
         కానీ లేరా యిది యొక్కకాకు సేసేజాడలా

చ. 1: కోరి వేఁడి తగిలినగోపసతు లుండఁగాను
       ఆరయ నా కొంగు వట్టె వల సతినా
       మేరతోఁ బెండ్లాడినరుక్మిణిదేవి వుండఁగాను
       యేరా నాతో నవ్వేవు యెగక్కెమా

చ. 2: చన విచ్చి మన్నించిన సత్యభామ వుండఁగాను
       చెనకేవు నే నీకుఁ జిక్కితినా
       పనివడి తెచ్చుకొన్నపదారువే లుండఁగాను
       ననుఁ జెక్కు నొక్కేవు నాఁటకములా

చ. 3: గంద మిచ్చి మెప్పించినకలికి యొకతె యుండ
       అంది నన్నుఁ గాఁగిలించే వాగడములా
       కందువ శ్రీవెంకటేశ కలసితి విటు నన్ను
       చిందేవు మోహము నాపై చిత్త వింత వచ్చెనా