పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0345-5 సాళంగం సంపుటం: 11-269

పల్లవి: మేలు మేలు యిందుకె నే మెచ్చితె వీని
         కే లెత్తెనె మొక్కితేను కినిసీనె తాను

చ. 1: చిన్నఁబోయి వుండఁగాను సెలవి నే నవ్వితేను
       మిన్నక నన్నుఁ గోపీంచీ మేలే వీఁడు
       యెన్నిక నెవ్వతెచేత నేమి మాఁట బఁడి వచ్చో
       కన్న వారిమీఁద నెల్ల కసరీనె తాను

చ. 2: తలవంచు కుండఁగాను దగ్గరి మాఁటాడించితే
       మెలుపునఁ దిట్ట వచ్చీ మేలె వీఁడు
       వలచి తా న్కెడనో వాదు వెట్టుకొని వచ్చి
       పొలసి వొద్దివారితోఁ బోరీనె తాను

చ. 3: గక్కన నొంటి నుండఁగఁ గాఁగిలించుకొంటేను
       మిక్కిలి తాఁ బెనఁగీని మేలే వీఁడు
       యెక్కడనో శ్రీవెంకటేశుఁ డలిగి వచ్చి
       దక్కిన రతులకె తమకించీఁ దాను