పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0345-4 సామంతం సంపుటం: 11-268

పల్లవి: నిక్కి నిక్కి చూచేవు నీ కేల నీకు
         దక్కితిమి తొల్లె మాపైఁ దల వేలా

చ. 1: కల్లరి వై నీవు రోలఁ గట్టువడుదువు గాక
       గొల్లదాన నాతోడి గొడ వేలా
       వుల్లసాన నీవు పాలవు ట్లెక్కుదువు గాక
       పిల్లఁ గోవిరాగాలఁ బిలువ నేలా

చ. 2: పిన్నవాఁడ వైననీవు పేయలఁ గాతవు గాక
       కన్ను లారిచెటిమాతోఁ గాఁక లేలా
       అన్నిటా నిందరిచేతి ఆడికఁ బడుదు కాక
       సన్నలఁ జాయల మాతో చల మేలా

చ. 3: పుక్కిన లోకాలు చూసి బూమెలు సేతువు గాక
       కక్కసించి మాతోడి కాఁపిరే లేలా
       యెక్కువ శ్రీవెంటటేశ యిర వై కూడితి నన్ను
       మిక్కిలి కృష్ణుఁడ నాతో మేకు లేలా