పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0345-3 మాళవిక సంపుటం: 11-267

పల్లవి: ఎంతైన నీగుణము యేల మానును
         చింతతో నీకుఁ బ్రియము చెప్పదుము గాక

చ. 1: కడు నెరదు చూచి మాకన్నులె ఘనము గాక
       వడి మాయింటికి నేఁడు వచ్చెవా నీవు
       వుడివోనితమకాన వుండజాల కొకమాఁట
       అడియాసలనె నిన్ను నాడుదుము గాక

చ. 2: నవ్వి నవ్వి యిదె మానడుమె సన్నము గాక
       అవ్వలఁ గొంతైన లోనయ్యేవా నీవు
       జవ్వనభారముచేత జడిసి నీభ్రమఁ బడి
       పువ్వుల పానుపుమీఁద బొరలదుఁ గాక

చ. 3: సారె నిన్నుఁ గాఁగిలించి చన్నులె గట్టాయఁ గాక
       చేరువ నామేలు దలఁచేవా నీవు
       కూరిమి శ్రీవెంకటేశ కూడి నేను తమకించి
       యీరీతిని నీ వురమె యెక్కు కొంటిఁ గాక