పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0344-6 రామక్రియ సంపుటం: 11-264

పల్లవి: చెప్పకునే నాతోడ చేరి నీసుద్దులు నేఁడు
         కప్పిన నీ నేరు పెల్లాఁ గలది నాతోనా

చ. 1: కానీ లేవె నే నతనిఁ గరఁగించ లే కుండితే
       నానఁ బెట్టి కొంత నీవు నవ్వుదు గాని
       పోనీ వూరకుండే యేపొద్దుదాఁకఁ గెలసేవు
       దాని కేమి నీ యాఁటదానితన మిందుకా

చ. 2: కొంత సయించవె పతి కొరత దీరుచ కుండితే
       చెంతల నప్పుడె సంతంసింతువు గాని
       పంతము లిప్పు డేఁటికె పని గలప్పుడే కాక
       యింత నంతటఁ బడెనా యిల జాణతనము

చ. 3: యిట్టె వోరుచు కుండవె యీతని రతిఁ జిక్కితే
       వట్టి సట నీవు దోడై వత్తువు గాని
       గట్టిగ శ్రీవెంకటాద్రి ఘనుఁ డిట్టె నన్ను గూడె
       పట్టినచలము నీకు బందె దెచ్చీనా