పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0344-4 ముఖారి సంపుటం: 11-262

పల్లవి: ఇన్నిటా దొరవు నీవు యింత సేతురా
         చన్ను లంటే విదె నీకు చల మాయఁగా

చ. 1: చెఱఁగు మాసినవేళ చేరి ముట్ట వచ్చేవు
       కొఱ తంటా వద్దంటేఁ గోపగించేవు
       మెఱసీ తొల్లిటి దోసమె నేఁ గురియఁగాను
       నెఱి నిది యిప్పుడె నీకు బాఁ తాయఁగా

చ. 2: యింట నే భోఁసేనేవేళ యెంగిలి ముట్ట వచ్చేవు
        అంటకు మన్నంతలోనె అలిగేవు
        వెంటనె నా నోటనుండి వేమారు జిందఁగాను
        జంటల నీ కదియున సర కాయఁగా

చ. 3: జలక మాడెటివేళ సంగడికి వచ్చేవు
       తొల మంటే కాఁగిలించి దొమ్మి సేసేవు
       మలసి శ్రీవెంకటేశ మలినముఁ బాయఁగాను
       తిలకించే వది నీకు దిష్ట మాయఁగా