పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0344-3 మలహరి సంపుటం: 11-261

పల్లవి: నీవే యెరుఁగుదు వింతే నీచిత్తము
         యీవేళ నే నోరిచితి యింకా నీచిత్తము

చ. 1: చెంతల నవ్వ వచ్చేవు చెయి వట్టి పెనఁగేవు
       అంతటి కోపితేఁ జాలు నైతే నీచిత్తము
       యింతటిదొర వంటాను యేమి ననఁ జాలు నింతె
       యెంత కెంత వెరచెనా యింకా నీ చిత్తము

చ. 2: కప్పురము చల్లేవు కాలు మీఁద వేసేవు
       అప్పటి పంతా లాడే వైతే నీచిత్తము
       యిప్పుడే నీకు మొక్కితి నిందరును జూడగాను
       యెప్పుడు నన్నెరఁగవా యింకా నీచిత్తము

చ. 3: బెట్టి కాఁగిలించేవు పిప్పి సేసేవు నామోవి
       అట్టె కానీ లేర అయితే నీ చిత్తము
       నెట్టన శ్రీవెంకటేశ నేఁడె నన్నుఁ గూడితివి
       యిట్టైతేనేఁ గా దనేనా యింకా నీ చిత్తము