పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0344-2 దేశాక్షి సంపుటం: 11-260

పల్లవి: పని గలప్పుడు వచ్చి పలికేఁ గాని
         వొరి నీ యింటిలోనె వుండేరా నేను

చ. 1: చిత్తము వచ్చినవేళ చేర వచ్చేఁ గాని నేను
       అత్తి యందాఁక లోని కంపరా నన్ను
       కత్తిఁ గోసిన ట్టయీఁ గడు నీమాఁటలు వింటే
       వొత్తిలి దవ్వుల నైన వుండేరా నేను

చ. 2: నిక్కెము నే నాల నై నీతో నవ్వేఁ గాని
        యిక్కువఁ దలవంచుకో నియ్యరా నన్ను
        ముక్కు వట్టినట్లయినా మోహము నీవు చల్లితే
        వొక్క నీసేవ సీసుక వుండేరా నేను

చ. 3: వలసినప్పుడె నీవద్ద గూచుండేఁ గాని
       యిల నందాఁక నలుగు నియ్యరా నన్ను
       బలిమి శ్రీవెంకటేశ పట్టి నన్నుఁ గూడితివి
       వొలిసే నీతలఁపులోన వుండేరా నేను