పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0343-6 సామంతం సంపుటం: 11-258

పల్లవి: తుదను దాఁచఁగ రాదు తోడ దిష్ట మై వుండఁగ
         మది మది యి ట్లైతి మగఁ డూర లేఁడూ

చ. 1: యిందరితో నీ మాఁట యే మని చెప్పుదు నమ్మ
       చెంది యీక్రిష్ణుఁడు చీర చిక్కించెను
       అందము సేసుక నేను అణఁచుక వుండే నంటే
       మంద నున్నాఁ డిదె నామగఁ డూర లేఁడూ

చ. 2: మంచిన మాయింటివారి మొగ మెట్టు చూతు నమ్మ
        పెంచిన క్రిష్ణునికిఁ గా బిడ్డఁ గంటివి
        పొంచి లోనఁ బెట్టుకొంటే పొరుగిరుగుల నింద
        మంచి దాయ బొంకే నంటే మగఁ డూర లేఁడూ

చ. 3: వెనక చుట్టాలతోడ వియ్య మెట్టందుదు నమ్మ
        యెనసి శ్రీవెంకటేశుఁడింట నున్నాఁడు
        పనివడి నేఁడు వచ్చి భ్రమసి చూచీ నదె
        మనికై యీన్నాళ్లదాఁక మగఁ డూర లేఁడూ