పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0343-5 నాగవరాళి సంపుటం: 11-257

పల్లవి: ఎంత చెల్లుబడి నీకు యెవ్వ రిచ్చి రోరి నీకు
          చెంత దొరతనము చెప్పి చూపేవా

చ. 1: మౌనముతో నుండఁగాను మాఁట లాడించ వచ్చేవు
       నేనాఁటదాన నైతే నేమము లేదా
       పూని జలక మాడఁగ బొంచి యాడకు వచ్చేవు
       మేనబావ వైనంతనే మేర మీరేవా

చ. 2: మోము వంచుకుండఁగానెమొక్కులు మొక్క వచ్చేవు
        బాముతో జవ్వను లైతే బలవు లేదా
        నోము నోమఁగానె చెక్కు నొక్కి రతికిఁ దీసేవు
        యేమిరా నీపొరు గైతే నింత సేసేవా

చ. 3: మంచముపై నుండఁగానె మరి కాఁగిలించేవు
        అంచె నీవొద్దనుంటే అడ్డము లేదా
        యెంచఁగానె శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
        కంచము పొత్తున నుంటే కాఁక రేఁచేవా