పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0343-2 ధన్నాశి సంపుటం: 11-254

పల్లవి: మోనాన నుందాన వేమే ముని వైతివా
         మేనులు సోఁకిన మందెమేళ మైన లేదా

చ. 1: అలిగితే నే మాయ అట్టె వూరకుండ నేల
       పలుకుల నైనఁ దూరఁ బాడి గాదా
       మలయుచుఁ బోట్లాడే మాసటీలు సయితము
       అలరి పగలు చాటే రది యైన లేదా

చ. 2: రా కుండితే నే మాయ రతి నాపై నెరపి
        దాకొని చెప్పంప నైనఁ దగవు గాదా
        కాకుగాఁ గొట్లాడేటి కడవారు సయితము
        ఆకడఁ జేతులు చాఁతు రదియూ లేదా

చ. 3: పంత మైతే నే మాయ ఫైకొని నే వేఁడుకోగా
        అంతట కోపము దీర నైనఁ జెల్లదా
        వింతగా శ్రీవెంకటాద్రివిభుఁడ నింతే నేను
        యింతలో నన్నుఁ గూడితి యెర వింత లేదా