పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0342-5 రామక్రియ సంపుటం: 11-251

పల్లవి: ఊరకున్నఁ బోనీవు వొక టొకటే రేఁచేవు
         గోర గీరితే నే రౌ మాకూటమి కోపుదువా

చ. 1: చిగురుఁగెమ్మో సోఁకఁ జేరి నే మాడెటిమాఁట
       వొగరు లై తోఁచు నందు కోపుదువా
       పొగరుతమ్మికన్నుల పూఁచి నేఁజూచెటిచూపు
       నిగుడునమ్ము లై తోఁచు నీ వోపుదువా

చ. 2: కొండలవంటి చన్నులు కోరి‌ నిన్నుఁ దాఁకించితే
       వుం డుండె కుమ్మెలు వోవు నోపుదువా
       బండివంటి మాపిరుఁదు బడి నీకుఁ దగిలితే
       అండ నీపైఁ బారుఁ జేసు నందు కోపుదువా

చ. 3: చల్లు మావూరుపుగాలి సమరతివేళల
       వుల్ల మెల్లఁ జిందు సేసు నోపుదువా
       యెల్లగా శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
       పెల్లు రేఁగి నేఁడు నాతోఁ బెనఁగ నోపుదువా