పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0342-3 నాదరామక్రియ సంపుటం: 11-249

పల్లవి: మగవారి కేఁటి మేలు మరతురు వేగిరమే
         బగివాయ కుండఁగానె పరా కె ట్టైతివిరా

చ. 1: ఆకె విలిచీ నంటా నట్టె విచ్చేసేవు గాని
       పైకొని మా యింటికి రాఁ బాపమా నీకు
       యీకడ నేఁ జూడఁగానె యించుకంత దయ లేక
       కైకొని తోసి విచ్చేయఁ గాళ్లెట్లాడెరా

చ. 2: అల్లది వచ్చీ నంటా అక్కడ చూచేవు గాని
       వొల్లనె మామొగ మైతే వొచ్చమా నీకు
       తొల్లిటిదాననె నీతొడమీఁదఁ బండుండఁగ
       మల్లడి యంతదవ్వు నీ మన సెట్టు వారెరా

చ. 3: మంతన మది యాడఁగ మరిఁ జె వొగ్గేవు గాని
       కొంత నామాట వింటే కొరతా నీవు
       చెంతల శ్రీవేంకటేశ చెప్పఁగా నన్నుఁ గూడితి
       వంతలోనె నీగుణము అ దెట్టు దిరిగెరా