పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0342-2 హిజ్జిజ్జి సంపుటం: 11-248

పల్లవి: పాప మంటాఁ దనమీఁద బత్తి సేయఁ బోతేను
         కొపగించుకొన వచ్చీ కొమ్మలాల చూడరే

చ. 1: అయ్యో యేమే తనకు నే నంటే నెంత సదరమే
       కొయ్యగదే ముక్కుననే కోప మున్నది
       చయ్యన నెవ్వతెతోనో జగడ మడిచి వచ్చీ
       వొయ్యన నేనడిగితే నుడికిపడీని

చ. 2: చెల్ల బో నే నెంత దనచేతికల సత్తినే
        పల్లదము దననోరఁ బై పై నున్నది
        కెల్లు రేఁగి యాడనో తా గిజి గిజి యై వచ్చీ
        కల్లగదె చూడఁ బోతే గదరుకొనీని

చ. 3: మేలు మేలె తన కెంత మిక్కిలి యనాదనే
        కీలుకొని బొమ్మల జంకెన లున్నది
        వే ళెరిఁగి శ్రీవెంకటవిభుఁడిట్టె నన్నుఁ గూడె
        కేలు చాఁచి పెనఁగితే కేరుచు నవ్వీనే