పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0341-6 బౌళి సంపుటం: 11-246

పల్లవి: చూడవే యప్పటినేనే జూటరి నట
         జాడలు తాఁ గట్టినపచ్చడమే యెరుఁగు

చ. 1: ముప్పిరిఁ దారా కుండఁగ ముసుఁగు వెట్టుక వుంటి
       అప్పటినేనే కల్ల నటవే చూడు
       నెప్పునఁ దమవొళ్లిది నేర మందురా యెవ్వరు
       తప్పులు సేసిన వెల్లె దయ్య మెరుఁగుఁ గాక

చ. 2: యెయ్యడకో తాఁ బోఁగా నిందుకు రమ్మంటి నింతే
       గయ్యాళి నేనే యట కమ్మటిఁ జూడు
       నెయ్యమునఁ దనతోడ నిజము నా దేడ కెక్కు
       అయ్యో తనవొళ్లికడ మాతుమే యెరుఁగూ

చ. 3: చెంత దాఁ బిలచుదాఁక సిగ్గున నుండితి నింతే
       పంతము నాదే యట బలువు చూడు
       యింతిరో శ్రీవెంకటేశుఁ డిప్పు డిట్టె నన్నుఁ గూడె
       పొంతల తనతగవు పొరు గెల్లా నెరుఁగూ