పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0341-5 కేదారగౌళ సంపుటం: 11-245

పల్లవి: నీవే జాణ నందు వాపె నీకంటేఁ గడు జాణ
         యేవిదాన నీపంతా లిఁక నీడఁ జెల్లవూ

చ. 1: కలికి పువ్వులచెండు కన్నులనె అద్దుకొంటా
       వలపుతో వసివాడు వాడుకొంటాను
       అలిగినదిఁ గాక అట్టె కూడినది గాక
       మలయుచు చెలులతో మాఁటలాడీ నదివో

చ. 2: పదిమారులును నిమ్మపం డెగర వేసుకొంటా
       చెదరినచింతతోఁ జింతించుకొంటా
       యెదుట నున్నది గాక యెడసినదిఁ గాక
       వొదిగి మలగుపై నొరగీ నదివో

చ. 3: మక్కువ యంతో వడికి మడిచినా కందుకొంటా
       అక్కరతో వుస్సు రస్సు రనుకొంటాను
       యిక్కు వంటినదిఁ గాక యియ్యకొన్నదిఁ గాక
       గక్కన శ్రీవెంకటేశ కాఁగిలించె నదివో