పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0341-4 మధ్యమావతి సంపుటం: 11-244

పల్లవి: లేలే యిది యంత లేదు లేమలాల
         కాలమందే మన మిది కన్నది గాదా

చ. 1: వల పింత గలవాడు వడి నే నలిగి రాఁగా
       పిలిచి మాఁటాడ రాదా ప్రియుఁ డప్పుడే
      తలఁచుక తలఁచుక తానేఁ డెవ్వరితోను
      బెళకుప్రియాలు చెప్పి బేరి బోకొట్టీనే

చ. 2: తగ వెరిఁగినవాడు తారుకాణించఁగ నాతో
       నగవు సేసుక నన్ను నమ్మించ రాదా
       సగము సగము గొంకి సత్యము లెవ్వరితోడ
       నిగిడించి మొక్కి యేరు నిద్దుర వుచ్చీనే

చ. 3: గక్కనఁ గూడెటివాఁడు కన్నీరు నించఁగాను
       అక్కరతో నా వగ పారుచ రాదా
       యెక్కు శ్రీవెంకటేశుఁ డిప్పుడుగా నన్నుఁ బొందె
       మిక్కిలి చెరువునీళ్ల మేలు వడసీనే