పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0341-3 సాళంగనాట సంపుటం: 11-243

పల్లవి: చాలు నూరకుండవయ్య సడి కేల వచ్చీనో
         నాలి నే మోనాన నుంటే నన్నుఁ దడవేవా

చ. 1: ఆడితి నే నొకమాఁట అందిరివలెనె నేను
       యీడ నెగ్గైనఁ జేసుకో యిత వైనఁ జేసుకో
       వీడె మియ్య నే రాఁగా విందు వెట్టి పగ లాయ
       వాడలో నాయింట నుంటే వాదు వెట్టుకొనేవా

చ. 2: మగిడి చూచితి నింతే మగఁడ మంటా నేను
       నగినా నగుము కాదాన్నా నన్నుఁ గా దను
       వగచితి నీకు నేను వడిఁ జల్ల వేఁ డాయ
       మగవాఁడ నై పట్టితే మచ్చరించేవా

చ. 3: పాదము లొత్తితి నింతే బడలి వచ్చితి వంటా
       సేదతో వెంగెము నీకు సేవగాఁ గైకొంటివో
       ఆదరించి శ్రీవెంకటాధిప నన్నుఁ గూడితి
       వేద దీర నే మొక్కితే వీడఁగ నాడేవా