పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0341-2 సామంతం సంపుటం: 11-242

పల్లవి: నావంటి సతులు తననగర నెందరు లేరే
         భావమున తనుఁ దలచి బతికే నేనూ

చ. 1: తగుల వలచుటె కాని తప్పు సేయట లేదు
       జిగి నేల పిలిచీనె చెప్పఁ గదరే
       అగడు నేయఁగ మిమ్ము నంపెనా నేఁ డతఁడు
       నగుఁబాటు గాక తనకు నాకుఁ బని యేమే

చ. 2: నవ్వు టొక్కటె కాని ననుపు దొంగిలితేను
       రవ్వ నాకడకుఁ దా రా నేఁటికే
       వువ్విళ్ల నిది వూరకుండ నే లనుచునా
       అవ్విభఁడు చలముకొనె నాఁడుగోల యేలే

చ. 3: యిచ్చ లాడుట గాని యెందు వోతి వన లేదు
       పచ్చిగా నా చెరఁగు పట్ట నేలే
       అచ్చలాన శ్రీవెంకటాదిపుఁడు నన్నుఁ గూడె
       తచ్చన లింతే కాక తానే నేఁ గానా