పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0340-6 రామక్రియ సంపుటం: 11-240

పల్లవి: ఏ మని యెంతునె వల పేరు లై పారఁగఁ జొచ్చె
         కామించి కామించి లో లో కాయము మరచెనే

చ. 1: పానుపుమీఁదనే వుండి పని గద్దంటాఁ బిలిచి
       మానిని విభునిఁ జూచి మనసు దనియదే
       పూని పట్టి నవ్వుతాను బుజముపైఁ జేయి వేసి
       నానీఁ జెమటనీట నామాఁట వినదే

చ. 2: ఆరగించి కూరలు చ వాయ నంటాఁ గళ్లు నేసి
       చేరి పతి కం దిచ్చి సిగ్గు గొంతాఁ బడదే
       పోరచిగా మాఁటలాడి పులకలఁ జిగిరించి
       ఆరితేరీ జాము వోయ నంపు మన్నా సంపదే

చ. 3: అట్టె నవ్వులు నవ్వి ఆన లెల్లాఁ బెట్టి పెట్టి
       పట్టి శ్రీవెంకటపతిఁ బై కొని తాఁ గూడెనే
       నెట్టన నుద్దాలు మెట్టి నిలుచుండి తమకము
       మెట్టుక నెరపీఁ గాని మీఁదు కిం దెరఁగదే