పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0340-5 కాంబోధి సంపుటం: 11-239

పల్లవి: తెలిపించుకొ మ్మననే దేశము వారిచేతనే
         కులికి సారెకు నా కొంగేల పట్టీనె

చ. 1: వాడలలో తననింద వడిఁ దేర్చుకొనుఁ గాక
       యీడ నన్ను నొట్టు వెట్ట నెంతవాఁడే
       ఆడితిఁ బో వెరపా అందరు నాడెటిమాఁట
       చూడవె తనకు నింత సులభమా నేను

చ. 2: సారెకు దేవుళ్ల వొద్ద సత్యము నెరపుఁ గాక
       వూర కైనా నన్ను ముట్టీ నుండఁ బట్టదా
       తారుకాణించెఁ బోవె తగిలితే నిందరిని
       వోరుచుకుండితే నూరకుండఁడు గా తాను
చ. 3: తనయింటిలోనఁ దానె తగవులు వెట్టుఁ గాక
       విను నా తోవ వచ్చితే వెఱ్ఱివాఁడే
       అనఁగానే శ్రీవెంకటాధిపుఁడు ననుఁ గూడె
       మన సొక్క టాయ నేఁడు మరఁ గేలె యికను