పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0340-4 రామక్రియ సంపుటం: 11-238

పల్లవి: నేరుపరి వవుదువు నీ కే మమ్మ ఆతఁ
         డీరానిచనవు లిచ్చె నిఁక నీ కే మమ్మ

చ. 1: మావంటివారికె మన సియ్యఁడు గాక
       నీవె ఆతఁడు గావా నీ కే మమ్మ
       తోవల నీవును మాతో డట్టె సొలసే వాతఁ
       డీవల నీయింట నున్నాఁ డిఁక నీ కే మమ్మా

చ. 2: మే మేమి చెప్పినాను మేరలు మీరుఁ గాక
       నీ మాఁట దోయఁడు నీ కే మమ్మ
       మోము చూచి మాకు మాకె మొగ మోడితిమి గాక
       యేమర వాతని నీవు యిఁక నీకే మమ్మా

చ. 3: వట్టి సట మా కైతె వరుస వం తిచ్చెఁ గాక
       నెట్టుకొనె నిన్నతఁడు నీ కే మమ్మ
       జట్టిగొని మమ్ముఁ గూడి సారె శ్రీవెంకటపతి
       నిట్టె నీవుఁ గూడతిని యిఁక నీ కే మమ్మా