పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0340-2 ముఖారి సంపుటం: 11-236

పల్లవి: జౌనే నీ సుద్దులకు అడ్డము చెప్పఁగ రాదు
         కాననియడల కైనఁ గలహలు వుట్టవా

చ. 1: యింటికి వచ్చెఁ జాలదా యేతువ లెత్తఁగ నేల
       కంటు లేని దొడ్డవానిఁ గల్ల నేతురా
       అంటి ముట్టి యిందు కెల్ల నాతఁడు గాఁగానె కాక
       గొంటరి చెలుల కైనఁ గోపములు రేఁగవా

చ. 2: పంత మిచ్చెఁ జాలదా పై ఫై బిగియ నేల
        చెంత నీప్రాణవిభునిఁ జిన్నఁ బుత్తురా
        అంతే పో నినుబోఁటి కాతఁడే తగుఁ గాక
        యంతయు మాకుఁ జూచితే యేవ వుట్టదా

చ. 3: చెక్కు నొక్కెఁ జాలదా చేతఁ దీసి వేయ నేల
        దక్కె శ్రీవెంకటేశుఁ దప్పు లెంతురా
        నిక్కము నాతఁడు నీవు నేరుచుకొంటిరి గాక
        తక్కిన మావంటివారు తగ వందురా