పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0339-6 సామంతం సంపుటం: 11-234

పల్లవి: చేరి మెల్లనె పొందులు సేయ వచ్చేవు
         నేరుపుల మాటాడేవు నే మరచితినా

చ. 1: అలిగి యప్పుడు నీతో నాడుకొన్నమాఁట లెల్ల
       పలుకుఁబంతాలె కాక బతిమాలేనా
       చెలిమి నీతో నింకాఁ జేయ వచ్చితేఁ గనక
       పలుమారు నీ వప్పుడు పంగించ రాదా

చ. 2: చేయి ముట్టి ని న్నప్పడు సేసినట్టిచేఁత లెల్ల
       యీయడ దక్కించుకోక యిఁక మానేనా
       వోయి నేఁ బ్రియాలు చెప్ప నొగి వచ్చితేఁ గనక
       నాయడ చూచి నీవు నవ్వ రాదా

చ. 3: కొసరి యప్పుడు నిన్నుఁ గోపించినది యల్లా
       పసు రెక్కుఁ గాక యిఁకఁ బంత మిచ్చేనా
       యెసగి శ్రీవెంకటేశ యింతలో నన్నుఁ గూడితి
       అసము దిగితేఁ గన కప్పుడన రాదా