పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0339-5 పాడి సంపుటం: 11-233

పల్లవి: చిత్తమునఁ గలయట్టు నేతువు గాని
         హత్తి మాకుఁ బని గద్దు అంపవయ్య మమ్మును

చ. 1: విన్నపాలు సేయఁ బట్టె వెంటఁ దిరిగాడఁ బట్టె
       నిన్నుఁ బొదుగుచు మాకు నేఁ డెల్లాను
       కన్నెవద్ది కేఁగ లేదు కలసుద్ది చెప్ప లేదు
       అన్న పనులును నాయ నంపవయ్య మమ్మును

చ. 2: యిచ్చకాలె ఆడఁ బట్టె యియ్యకోలె సేయఁ బట్టె
       నెచ్చెలుల మిదె నీతో నేఁ డెల్లాను
       వచ్చేది నెరఁగము వడి రాని దెరఁగము
       అచ్చుపడెఁ జేఁత లెల్ల నంపవయ్య మమ్మును

చ. 3: తోవ నడవనె పట్టె తోడుక రానె పట్టె
       నీవు నేముఁ జేరితిమి నేఁ డెల్లాను
       శ్రీవెంకటేశ్వరుఁడ చెలితోడఁ గూడితివి
       ఆవల వాకిట నుండే నంపవయ్య మమ్మును