పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0339-3 సామంతం సంపుటం: 11-231

పల్లవి: వేవేలు దండాలు నీకు విడరా నన్ను
         యీవల నింత లేకున్న యెట్లు దరించేవురా

చ. 1: వాడుఁగన్నుల చూపుల వడి నాపై నొరగేవు
       యేడ నేరుచుకొంటివి యేరా నీవు
       ఆడికెకు నామీఁద నంత బత్తి గలయట్టె
       వీడె మియ్య వచ్చేవు వెరతురా నీకు

చ. 2: నవ్వుల జాణతనాలు నయగారి వినయాలు
       యెవ్వతె నేరిపెరా యేరా నీకు
       పవ్వళించి యింతలోనె పైఁ గాలు చాఁచేవు
       జవ్వని నింత యాఁప దోసమురా నీకు

చ. 3: కామించి కలయు మని కాఁగిటిలో దైన్యములు
       యేమి అభ్యసించితవి యేరా నీవు
       చే ముంచి శ్రీవెంకటేశ చెలఁగి కూడితి నన్ను
       వాముల ని దెల్లా మరవకురా నీవూ