పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0339-1 ముఖారి సంపుటం: 11-229

పల్లవి: ఊరకున్నవారితోడ వూ రోప దన్నమాఁట
         నేరుచుకొంటి నేను నీ వేమి సేసేవే

చ. 1: చుట్టము లయినవారు సొలసి సాలసి యంత
       తిట్టినా యెగ్గు లౌనా తేజమే కాక
       వొట్టి నీవు కోపగించి వూరకే యే మనినాను
       నట్టనడుమను నాకు నవ్వు వచ్చీనే

చ. 2: చేతికి లో నైనవారు చెనకి యంత మీరినా
        ఘాలతలను హీన మౌనా ఘనతే కాక
        పోతరించి నీవు నన్ను పూఁచి యేమి సేసినాను
        జాతి నా మన సన్నిటా సమ్మతించీనే

చ. 3: కాఁగిఁట గూడినవారు కడుఁ దమకించినాను
       మూఁగి వేసట వుట్టునా ముదేమే కాక
       యేఁగి వచ్చి శ్రీవెంకటేశుఁడ కూడితి నన్ను
       వీఁగని నీ రతు లెల్ల విందు లయ్యీనే