పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0338-6 శుద్దవసంతం సంపుటం: 11-228

పల్లవి: ఎట్టు నమ్మ వచ్చురా యిటువంటి నిన్నును
         వట్టి మాయలఁ బెట్టేవు వద్దు వద్దు తలరా

చ. 1: మంచివానివలెనె నా మాటలు వెలచుకొని
       యెంచి చూచి నీలోనె యేల నవ్వేవు
       చుంచుల నా చుట్టమవో సూడుబంటవో నీవు
       అంచల నన్నియు నాయ నప్పటి నంటకురా

చ. 2: వలచినవానివలె వద్దికి రప్పించుకొని
       తలఁపు చేకొని జాణతనా లాడేవు
       యిల నీ గుణ మిదెయోయింతయు నా భాగ్యమో
       కలపుకో లిఁక నేల కంటి నూరకుండరా

చ. 3: బత్తి గలవానివలె పట్టి యాకు మడి వచ్చి
       యిత్తల మదన మెత్తించి యెమ్మె చూపేవు
       హత్తిన శ్రీవెంకటేశ అట్టె ఫలమో చలమో
       చిత్తగించి కూడితివి సిగ్గు లిఁక నేలరా