పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0338-3 కేదారగౌళ సంపుటం: 11-225

పల్లవి: నీకు బాఁతి గాక ఆకె నేరువులు మాకు బాఁతె
         దాకొని యాసుద్ది నీతోఁ దడవ వచ్చితమా

చ. 1: అంత బత్తిగలవాఁడ వాకె నింటికిఁ గొంపోయి
       చెంత నెత్తిఁ బెట్టుక పూజించ రాదా
       యెంత లే దాపె మాఁటలే యీడఁ జెల్ల బెట్ట వచ్చే
       వంతలో సాకిరి నిన్ను నడుగ వచ్చితిమా

చ. 2: మించి నీ వాపెకుఁ గడు మేలువాఁడ వైతేను
       యెంచి నీ మేనిలో సగ మియ్య రాదా
       మంచి దంటా నాపె నీడ మంతనానఁ బొగడేవు
       యించుక కైనాఁ దేగ మియ్యఁగ వచ్చితిమా

చ. 3: తిరముగ నాపెఁ గొని తెచ్చుకొన్నవాఁడ వైతే
        యిర వై నీ గద్దెమీఁద నెక్కించ రాదా
        వొరిమి శ్రీవెంకటేశ వురముపై నే నుందాన
        సిరసు వంచేవు నీకు సిగ్గులు రేఁచితమా