పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0338-2 కాంబోది సంపుటం: 11-224

పల్లవి: ఏమి సేయు మన్నఁ జేసీ యెరపరికము లేల
         చే మంచితి నా యడకు శిబ్బితి పడకురా

చ. 1: చేరి నాతో నేమో మాట చెప్ప వచ్చినవాఁడవు
       కోరి యంతలోనే గుక్కుకొందురా నీవు
       వూరకే మా యింటిదాఁక నొంటి వచ్చినవాఁడవు
       పోరచి వై యట్టె మళ్లి పోదురా నీవు

చ. 2: మొదల నాతో నవ్వ మొగ మెత్తినవాఁడవు
        వదలి యంతలోఁ దల వంతురా నీవు
        పదిమారులు నన్నుఁ దప్పక చూచినవాఁడవు
        చెదరి యట్టె పరాకు సేతురా నీవు

చ. 3: యిట్టె నన్నుఁ గాఁగిటిలో యెచ్చరించినవాఁడవు
       ఱట్టు కెక్క నీ మేను మఱతురా నీవు
       గుట్టున శ్రీవెంకటేశ కూడినట్టివాఁడవు
       యిట్టెనై వెనక ముందు లెంతురా నీవు