పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0338-1 మాళవిశ్రీ సంపుటం: 11-223

పల్లవి: ఎంత కెంత సేసేవు యేరా నీవు
         పంతగాఁడ మేలు మేలు ఫైకొని వచ్చేవు

చ. 1: వొడివట్టి తీసేవు వోప నంటేఁ దిట్టేవు
       పడఁతులతో నేర బలువా నీకు
       అడరి నా వెంట వచ్చే వప్పులవానివలె
       విడువ వింత పనికి వెరతురా నీకు

చ. 2: ఆదిగొని పై నొరగేవు అట్టట్టే పోతేఁ బట్టేవు
       సాదులతోనె యింత చలమా నీకు
       గోదిలి సాదించేవు గొనుకొన్నవానివలె
       యీ దెస నీ గాతికిన యింత కోపఁ గలవా

చ. 3: కామించి నగ వచ్చేవు కాఁగిట బిగించేవు
       యేమి నననివారితో యేతులా నీకు
       దోమటి దొడికితిని దొడ్డచుట్టమువలెనె
       నేమపు శ్రీవెంకటేశ నీవె నీ నయితిరా