పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0337-6 నాదరామక్రియ సంపుటం: 11-222

పల్లవి: నీవే నాపై బత్తి యైతే నేఁడి ట్లేంటి కయ్యీ
         కావరపు నీ బత్తి కల్ల యేమో కాక

చ. 1: కొప్పు వీడెఁ గదరా కోరి నీవు మొక్కఁగాను
       వొప్పుగా నే నీకు మొక్కే దొమ్మదో కాక
       దప్పి గొంటిఁ గదరా తగ నీతో నవ్వఁగాను
       అప్పటి నీతో నవ్వు లయి రావో కాక

చ. 2: కాలు జారెఁ గదరా కమ్మి నీ కెదురు రాఁగ
       తూలుచు నీ తెరువు రా దోసమో కాక
       వోలిఁ జెమరించెరా వొగి నిన్నుఁ జూడగాను
       తాలిమి నిన్నుఁ జూచేది తగనిదో కాక

చ. 3: కాఁక రేఁగెఁ గదరా కాఁగిట నిన్నుఁ బట్టఁగ
       వేఁకపు నీతో రతి వెంగెమో కాక
       యేఁకట శ్రీ వెంకటేశ యిత వాయఁ గదరా
       మాఁకు పడ మరుఁ డింత మరిపెనో కాక