పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0337-5 ముఖారి సంపుటం: 11-221

పల్లవి: తతి గాని తతి నేల తమకించేరే
         మతిలోని నొప్పి గొంత మాన నియ్యరే

చ. 1: పతిఁ బాసి వున్న దాన బలు విరహపువేళ
       యిత వంటా విరులు నా కేల యిచ్చేరే
       రతిరాజనమ్ము లివి రంట దెప్పరపువేళ
       కతుకున నాఁటుఁ జేసు గవిశన నిడరే

చ. 2: కందువ జవ్వనమునఁ గావరించి వున్నవేళ
       యింద మంటా గందము నా కేల పూసేరే
       మందమారుతాన కవి మచ్చు చల్లే చొక్కుమందు
       యిందు కేల పెట్టెఁ గట్టి యింటిలోన నిడరే

చ. 3: శ్రీవెంకటేశువొద్ద సిగ్గువడి వున్న దాన
       చేవ దేర నిప్పు డేమి సింగారించేరే
       యీవల నాతఁడు గూడె యీ సొమ్ము లిన్నియును
       వేవే లాతఁ డిచ్చినవె వేగిర పడకురే