పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0337-3 గౌళ సంపుటం: 11-219

పల్లవి: తా నెంత నే నెంత తగునా తాను
         తేనె పూసి మాటలను తేలించీఁ దానూ

చ. 1: రమ్మనఁగా తనతో నే రా నంటినా నాకు
       అమ్మరో ప్రియము చెప్పీ న దేమె తాను
       కమ్మి సారెకు నలుగఁ గడదాననా
       చిమ్ముచు నా కిచ్చకాలు సేయ నేలే తానూ

చ. 2: చలమునఁ దన మాఁట జవదాఁటేనా
       చెలులచేఁ జెప్పించీ చెల్లఁబో వీఁడు
       చలిమి బలిమి నాతో సారెఁ జెల్లదా
       వెలి న న్నొడఁబరచీ వెర పేలే తానూ

చ. 3: యితరులవలెఁ దన్ను నెగ్గు లెంచేనా
       అతివినయాలు చేసీ నౌనే తాను
       యిత వై శ్రీవెంటేశుడిట్టె కూడెను
       మతిలోని వెలుతులు మరి యాలే తానూ