పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0337-1 శంకరాభరణం సంపుటం: 11-217

పల్లవి: అప్పట నుంటిఁ గోప మాఁప లేను
         వొప్పుగ నీవే నాకు వొడఁబఁడ జెప్పరా

చ. 1: మేఁటి వై నీవొక్కఁడవే మేడమీఁద నుండితిని
       ఆఁటది మాఁటలాడిని ట్టాయ నందు
       యేఁటికి బొంకేవు నాతో యెవ్వతెఁ దెచ్చితి వోరి
       నాఁటకుఁడ నా మనసు నమ్మించరా

చ. 2: నిద్దిరించి పానుపుపై నీవే యంటా నుంటి
        యిద్దరుఁ బవళించినయిర వున్నది
        వద్దురా మరఁగు నాతో వనిత నెందు దాఁచితి
        గద్దరీఁడ నాలోని కలఁ కెల్లఁ బాపరా

చ. 3: కాఁగిటిలో నీవు నేనుఁ గలసితి మిద్దరము
       రేఁగి నీ మేనిపై వింతరేక లున్నవి
       దాఁగ నీ పనులు నేఁడు దక్కితి శ్రీవెంకటేశ
       పాఁగినజాణఁడ నాతోఁ బలికి మెప్పించరా