పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0336-3 బౌళి సంపుటం: 11-213

పల్లవి: నే నెంత చిన్న నైనా నీకే సులభము గాని
         పూని నా సరివారికిఁ బొడవే సుమ్మీ

చ. 1: యిచ్చకపుపతివి నీ వే మన్నా నితవే నాకు
       కొచ్చి కొచ్చి తిట్టినాను కోప మున్నదా
       తెచ్చుకొన్న నీసతులు తేనెల మాఁటాడినాను
       మచ్చరములై పెరిగి మర్మములు నాఁటురా

చ. 2: నీఁటున బ్రాణవిభుఁడ నీవేమి సేసినా
       వాఁటమై మొక్కుదుఁ గాక వాసి వట్టెనా
       నాఁటకపు సవతులు నయగారాలు సేసినా
       యీఁటెల పోట్లే కాక యింత కోపేనా

చ. 3: చేరి నన్ను నేలినట్టి శ్రీవెంకటేశ నీవు
        యేరీతి నుండినాను యెర వున్నదా
        సారెకు నీవు ముట్టినసవతులు వద్ద నున్నా
        నీరసమె రేఁగుఁగాని యీయకోలు గాదురా