పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0336-2 సామంతం సంపుటం: 11-212

పల్లవి: చెల్ల బో యిందుకు నేల చిన్నఁ బోయ్యేవు
         అల్లాడ నీ కేమైన నది నే నచ్చేరా

చ. 1: సరి నెందు వొయ్యే వంటే సకినాలు వాటించి
       తిరిగి తిరిగి వచ్చి తిట్టే వేరా
       అరుదు నీ కింతైతే నందు వోయ్యేపనులకు
       వెరవుతోడఁ జేటవేలుపులఁ జూడరా

చ. 2: ఆరగించి పొమ్మంటే నదియునుఁ గాని దంటా
        గోర సేసి ఆనవెట్టి కోపగించేవు
        ఆరయ నీ మనసుకు ననుమాన మైతేను
        పోరచి నీ పొరుగునఁ బోచిళ్ళు చల్లరా

చ. 3: వొగి నీకు మొక్కినాను వొకచోటి కేఁగేవేళ
       తగ దంటా నీకు నీవే తప్ప నాడేవు
       జిగి నన్నుఁ గూడితివి శ్రీవెంకటేశ యిట్టె
       పొగరుల నిఁకఁ బోయి పులుగు నర్చించరా